పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు (ఉషశ్రీ)
About
ఉషశ్రీ అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. కాకరపర్రు గ్రామంలో 1928, మార్చి 16న జన్మించారు. కాకరపర్రు నుంచి ఆలమూరు మకాం మార్చాక, అక్కడే చదువుకు శ్రీకారం చుట్టారు. తండ్రి పురాణపండ రామమూర్తి, తల్లి పురాణపండ అన్నపూర్ణమ్మ. వ్యాస భారతాన్ని యథాతథం తెలుగులోకి రాయాలన్న సంకల్పంతో తండ్రి రామమూర్తిగారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఉషశ్రీ ఆ మహాక్రతువుకి ఎడిటర్‌ బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల మూడు పదులు కూడా నిండకముందే ఉషశ్రీ మహాభారత సాగరాన్ని ఔపోసన పట్టేశారు. ఆయన కన్ను మూసేవరకు మహాభారత రామాయణాలే రక్తమాంసాలుగా జీవించారు. 1965లో ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో ఉద్యోగం చేశారు. 1969లో విజయవాడ చేరుకున్నారు. 1973లో రేడియోలో ధర్మసందేహాలు కార్యక్రమం ద్వారా శ్రోతల ప్రశ్నలకు సమాధానాలతో పాటు, మహాభారత ప్రవచనం కూడా చేశారు. తెలుగు రాష్ట్రాలలో పేరుప్రఖ్యాతులు గడించారు. ఎన్ని బిరుదులు వచ్చినా అన్నిటినీ తోసి పుచ్చారు. శృంగేరీ శారదాపీఠం వారు ఆస్థాన పండితుడిగా నియమించారు. జిల్లేళ్లమూడి అమ్మ, తిరుపతి వెంకటేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, కాళహస్తీశ్వరుడు అందరూ ఉషశ్రీని రప్పించుకుని సత్కరించి పంపారు. నవలా లేఖావళి, చిన్న కథలు, నవలలు, యక్షగానాలు, పద్య కావ్యాలు, ప్రబంధాలు, ఇతిహాసాలు అన్నీ తన కలం నుంచి జాలువార్చారు ఉషశ్రీ. 1990 సెప్టెంబరు 7వ తేదీన స్వస్తి అంటూ అనారోగ్యంతో కన్నుమూశారు ఉషశ్రీ.
Contact Us :
Help us in improving this website! This website is a non-profit & non-commerical platform for all the aaramadravida group members. We are always open for suggestions and improvements. If you have anything comes in mind, please do not hesitate to reach below members :

1. ఆకుండి సూర్యనారాయణ     2.తాతపూడి కీర్తి    3.చర్ల సంజీవరావు

This website / forum is goverened by these policies.

aaramadravida.com 2022 © All Rights Reserved.