About
శ్రీ ఆకుండి రామకృష్ణ గారు మద్రాసులో అమెరికన్ రిపోర్టర్ కు (అమెరికన్ ప్రభుత్వం వారి) మరియు ఆంధ్ర ప్రభ దిన పత్రికకు సంపాదకులుగా 35 ఏళ్ళు సేవలనందించారు. వీరు 1912 నవంబర్ 3 న కాక్రపర్రులో శ్రీ వ్యాస శాస్త్రి, శ్రీమతి గౌరి దేవి గారికి జన్మించారు . స్వాతంత్య్ర పోరాటంలా విశిష్టంగా పాల్గొన్నారు . ఎన్నో రచనలు చేశారు, వీరి భార్య భవాని దేవి గారు పల్లెపాలెం వాస్తవ్యురాలు, ఆమె రామకృష్ణ గారి శతకం అచ్చు వేసారు. 1952 లో రామకృష్ణ గారు అమెరికన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు అమెరికా పర్యటించి, ఎన్నో చో ట్ల అధ్యయనాలు చేసి వచ్చారు, రాసారు. ప్రముఖ యూరప్ దేశాలు పర్యటించి వచ్చారు . 1975 ఆగష్టు 15 న కాలం చేశారు. వీరి తండ్రిగారు గొప్ప పండితుడు , తెలుగులో శబ్ద రత్నాఫణం అనే నిఘంటువు రచించారు . వీరి ముతాత్త గారు శ్రీ ఆకుండి వ్యాస మూర్తి సిద్ధాంతి గారు , వీరు సంస్కృతంలో మహా భారతం రాసారు , ఇది గొప్ప రచనగా పేరున్నది. రామకృష్ణ గారు చాలా మందికి సహాయం చేసేవారు, ఎంతో మందికి ఎన్నో రకాల సహాయాలు అందించే వారు. ఆ రోజుల్లో మద్రాసులో ని తెలుగు ప్రముఖులలో ఒకరు.
గౌరి, వసంత , వ్యాస రంజన్ మరియు ఆనంద్ లు వీరి పిల్లలు.