మన ఆరామ ద్రావిడ పెద్దలు, పూజ్యులు చాలామంది ఉన్నారు. వారి గురించి మనం తెలుసు కోవాలి, భావి తరాలకు తెలియ
చెయ్యాలి.
మీకు తెలిసిన వారి గురించిన రచనలు, పుస్తకాలు, లేదా ఒక చిన్న వ్యాసం, ఫొటోలు, ఏ సమాచారం అయినా మాకు పంపగలరు.
సభ్యులందరూ వారి వారి వద్ద వున్న వివరాలు అందించమని మనవి...
ఆరామద్రావిడ వంశ చరిత్ర అను ఈ గ్రంధమును, వంశ వృక్షమును బ్రహ్మశ్రీ ద్వివేదుల అనంత పద్మనాభ శర్మ గారు, 1919
వ సంవత్సరములో వ్రాయుట ప్రారంభించిరి. ద్రవిడ దేశమున నున్న ద్రావిడుల గూర్చి, వారి యొక్క శాఖలు,ఆచార
వ్యవహారములు,వివాహాది శుభకార్యములు,విద్యా నైపుణ్యాలు, ఘనతను గూర్చి ఆయన అనేక
విషయములను సేకరించి 1935 వ సంవత్సరమున పూర్తి చేసిరి.ఆనాడు ఆ ప్రతిని బ్రహ్మశ్రీ ఆణివిళ్ళ సుబ్బారావు గారు,
బ్రహ్మశ్రీ అల్లమరాజు రామకృష్ణ కవి గారు, బ్రహ్మశ్రీ పంతుల సుబ్బయ్య శాస్త్రి గారు పరిశీలించి వ్యాపింప
చేసిన బాగుండును అని వారి అభిప్రాయములు తెలియజేసిరి. ఆనాటి ఆర్ధిక పరిస్థితిని బట్టి అనంత పద్మనాభము గారు
అనేక కాపీలు వ్రాసి ఇచ్చారు.
1919 నాటి అసలు ప్రతి - 2019 నాటికి శత
సంవత్సరాలు
1919 నాటి అసలు వంశ వృక్షం - 2019 నాటికి శత
సంవత్సరాలు
అనంత పద్మనాభ శర్మ గారి కుమారుడైన, ద్వివేదుల వేంకట రామారావు గారు, ఆ కాలమునందు వ్రాయబడిన ఆ ప్రతిని,
పోషకుల, ప్రోత్సాహకుల కోరికపై ముద్రణకు అనుకూలముగాను, నేటి వరకూ ఈ శాఖలో ఖ్యాతినొందిన వారి వివరములు చేర్చి
ముద్రించిరి.
తరాలు మారినా, ఈ ఆరామద్రావిడ వంశ పూర్వీకుల ఘనత, చరిత్ర, వేంకట రామారావు గారి కుమారులైన అనంత పద్మనాభం,
రామాంజనేయ రావు ల వద్ద పుస్తక రూపం లో భద్రమై వుంది.ఈ గ్రంధమునందు ఏఏ విషయములు వున్నవో విషయసూచిక నందు తెలుప
బడినది.
విషయసూచిక :
- బ్రాహ్మణుల వివిధ శాఖలు
- గోత్రములు
- పక్షములు
- ప్రవరలు
- వంశములు
- సప్త ఋషులు
- ఇంటి పేర్లు ఏర్పడుట
- సభలు-సంఘములు
- అకారాది ఇంటిపేర్లు
- ప్రవర లక్షణం-ప్రవర సామ్యము
- గోత్రప్రవర లకు గణములు
- భృగు గణములు
- ఆంగీరసుడు, గౌతమాంగీరసుల గణములు
- భరధ్వాజ గణములు
- కేవలాంగీరసుల గణములు
- అత్రి గణములు
- విశ్వామిత్ర గణములు
- కశ్య గణములు
- వశిష్ట గణములు
- అగస్త్య గణములు
- ఆపస్తంబ బోధాయన సూత్రములు
- కన్యను విడచుట
- వివహమునందు ఇతర నిషేధములు
- గృహ నిర్మాణము, శుభకార్యములు- మణ్డన ముణ్డన నిర్ణయం
- సామవేద త్రికాల సంధ్యావందనము
ఆసక్తి కల వారలు ప్రతుల కొరకు, సమాచారము కొరకు ,క్రింద ఇవ్వబడిన ఫోను నంబరులకు సంప్రదించగలరు.